డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “హరికథ” వెబ్ సిరీస్

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ “హరికథ” అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొచ్చింది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ రోజు నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. “హరికథ” వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ “హరికథ” సిరీస్ కు దర్శకత్వం వహించారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “హరికథ” వెబ్ సిరీస్ లో వైవిధ్యమైన కథా కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్, సీజీ వర్క్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్ వంటి మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. హాట్ స్టార్ కు మరో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ను అందిస్తూ “హరికథ” ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నటీనటులు – దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – కిరణ్ మామిడి
ఎడిటర్ – జునైద్ సిద్ధిఖీ
డీవోపీ – విజయ్ ఉలగనాథ్
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిలి
రైటర్ – సురేష్ జై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రామ్మోహన్ రెడ్డి, సుజిత్ కుమార్ చౌదరి కొల్లి, శశికిరణ్ నారాయణ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూఛిబొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
డైరెక్షన్ – మ్యాగీ

Related Posts

Latest News Updates