నారాయణ దాస విరచిత యదార్థ రామాయణ హరికథా గానములు హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో జరుగుతున్నాయి. ఆదిభట్ల నారాయణ దాసు, హరికథా ప్రవీణ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల సంస్మరణ పూర్వక హరికథా గాన మహోత్సవాలతో ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు జరుగుతున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6:15 నిమిషల నుంచి 9 గంటల వరకూ జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శ్రీరామ జననము హరికథా గానాన్ని టీటీడీ ఆస్థాన విద్వాంసులు ఎమ్. రాముడు భాగవతులచే జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్ర మహిళా సభ సంగీత కళాశాల కార్యదర్శి డా. ఎర్రమిల్లి రమాప్రభ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోడిగ లక్ష్మినారాయణ భాగవతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు అంటే… గురువారం రోజున శ్రీమతి సప్పా భారతి భాగవతారాణి చే సీతా కల్యాణం హరికథా గానము వుంటుంది. విశిష్ట అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి హాజరవుతున్నారు.