ఆసక్తికర కథ, కథనంతో ‘హలో మీరా’..

రాను రాను సినీ లోకంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. భారీ తారాగణం సంగతి అటుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు నేటితరం ఆడియన్స్. కథలో కొత్తదనం ఉంటే ఆ సినిమాను అందలమెక్కిస్తున్నారు. అదే బాటలో అలాంటి ఓ ప్రయోగాత్మక కథను ”హలో మీరా” రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు కాకర్ల శ్రీనివాసు.  ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సింగిల్ క్యారెక్టర్ తో ఓ వైవిధ్యభరితమైన కథను రెడీ చేసిన డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు.. ఈ సినిమాను హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందు పెట్టబోతున్నారు. విజయవాడ నుంచి హైద్రాబాద్ ప్రయాణం, ఆ ఒక్కరోజులో చోటు చేసుకునే పరిణామాలను ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నారట. సింగల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం అనే ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టుతో ఈ హలో మీరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు.
తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని “హలో మీరా” కథపై ఎన్నో కసరత్తులు చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అవుట్ పుట్ తీసుకొస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఈ డిఫరెంట్ మూవీని  గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ హలో మీరా అనే ప్రయోగాత్మక  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు.  డా : లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం పక్కా అంటున్నారు మేకర్స్.  కథ ,స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీనివాసు కాకర్ల ప్రొడ్యూసర్స్: డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల,  పద్మ కాకర్ల     మ్యూజిక్: ఎస్ చిన్న  పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి  సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి   మేకప్: పి రాంబాబు  అసోసియేట్ డైరెక్టర్: సూరి సాధనాల  ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] పాటలు: శ్రీ సాయి కిరణ్  సింగర్స్:  సమీరా భరద్వాజ్ ,దీపక్ బ్లూ  సౌండ్ డిజైనర్: శరత్  [సౌండ్ పోస్ట్]  ఆడియోగ్రఫీ: ఎం  గీత గురప్ప  పబ్లిసిటీ డిజైనర్: కృష్ణ డిజిటల్స్  మాటలు  హిరణ్మయి కళ్యాణ్  ఎడిటర్: రాంబాబు మేడికొండ

Related Posts

Latest News Updates