గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ రివ్యూ

నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR.

సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి ముఖ్య పాత్రల్లో ఏ బి డి ప్రొడక్షన్స్ పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మాతగా వెంకటేష్ కొండిపోగు దర్శకత్వం వహించగా ధర్మ డిఓపి, ఎడిటర్, రచయిత మరియు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా గల్లీ గ్యాంగ్ స్టార్స్. ఇవాళ విడుదలైన ఈ సినిమా రివ్యూ.

కథ విషయానికొస్తే : నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సినిమా. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు మరియు క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధలు. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్. అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మించడం వంటి నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ లక్ష్మీ ని ప్రేమిస్తూ ఉంటాడు. గోల్డ్ రెడ్డి గాంధీ ప్రేమిస్తున్న లక్ష్మీని ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్ళకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. తన మాటలలో గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్ గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారు?
తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే : మొత్తం కొత్త వారైనా కూడా మంచి నటనను కనబరిచారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీ గా మంచి పాత్ర పోషించాడు, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి అందరూ కూడా తమ పాత్రకు తగిన న్యాయం చేశారు.

టెక్నికల్ ఆస్పెక్ట్స్ : ఏ బి డి ప్రొడక్షన్స్ పై డా. ఆరవేటి యశోవర్ధన్ నిర్మాతగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను నిర్మించారు. ధర్మ రచయిత, ఎడిటర్, డిఓపిగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాడు. ధర్మ దర్శకత్వ పర్యవేక్షణలో వెంకటేష్ కొండిపోగు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా డిఓపిగా ధర్మ సినిమాటోగ్రఫీ వర్క్ బాగా చేశాడు. సత్య శరత్ రామ్ రవి సంగీత సారధ్యంలో ఇచ్చిన పాటలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ : ధర్మ ఎంచుకున్న కథ కథనం
సత్య, శరత్ రామ్ రవి ఇచ్చిన పాటలు
టెక్నికల్ వాల్యూస్
ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ వర్క్

మైనస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్
కొన్ని అనుచిత సంభాషణలు

రేటింగ్ : 2.75/5

*యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్*

Related Posts

Latest News Updates