గుజరాత్ లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత ఎన్నికల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే… తొలి విడత పోలింగ్ సందర్భంగా చెదురు ముదురు సంఘటనలు జరిగాయి. మొత్తానికి ప్రశాంతంగానే ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 48.48 శాతం నమోదైంది. అత్యధికంగా తపి నియోజకవర్గంలో 63.98 శాతం పోలింగ్ నమోదైంది. ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ (First Phase Pollling) జరిగింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.