మోదీ స్టేడియం పేరును పటేల్ స్టేడియంగా మార్చేస్తాం… కాంగ్రెస్ కీలక హామీ

గుజరాత్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోను ప్రకటించింది. తాము గనక అధికారంలోకి వస్తే అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని ప్రకటించింది. మోదీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా పేరు మార్చుతామని ప్రకటించింది. జనతా సర్కార్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోను అధికారిక పత్రంగా ఆమోదిస్తామని రాజస్థాన్ సీఎం గెహ్లాత్ ప్రకటించారు.

 

తాము గుజరాత్ లో అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఒంటరి మహిళలు, వితంతువులు, ముసలి వారికి 2 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టలో పొందుపరిచారు. 3 లక్షల వరకూ వ్యవసాయ రుణమాఫీ, ఉచిత విద్యుత్తును ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల చొప్పున ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్లను అందజేస్తామని తెలిపారు.

Related Posts

Latest News Updates