టీఎస్పీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా గ్రూప్ 3 నోటిఫికేషన్ ను కూడా శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గురువారమే ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 783 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి.