గ్రాండ్ గా బుల్లెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీ బండి సదానంద్ & మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం బుల్లెట్. చౌడప్ప దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మెగా ప్రొడ్యూసర్ ఏ.ఎం రత్నం, దర్శకులు వి సముద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏ.ఎం రత్నం మాట్లాడుతూ..”ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే ఆరడుగుల బుల్లెట్టును ఇందులో హీరోగా సెలెక్ట్ చేశారు. ప్రతి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ..”మార్చి 8న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్ర దర్శకుడు చౌడప్ప గారు నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి గతంలో ఎన్నో చిత్రాలకు పని చేశాం. ఈ సినిమా కోసం చాలా ప్యాషన్ తో వర్క్ చేశారు. ఈ సినిమాతో హీరో రవి వర్మ పెద్ద హీరో అవుతాడని ఆశిస్తున్నా” అని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీచక్ర ఎండి శ్రీ హరినాథ్ గారు సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

హీరో రవి వర్మ మాట్లాడుతూ..”హీరోగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ థియేటర్లో ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది” అని చెప్పారు.

దర్శకుడు చౌడప్ప మాట్లాడుతూ..”ఇదొక యాక్షన్ మూవీ. కర్నూల్ లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. నందమూరి హరి గారు ఈ చిత్రానికి అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. సుభాష్ ఆనంద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. హీరో రవి వర్మ కొత్తవాడైనా చాలా బాగా చేశాడు. అతనికి ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయి” అని అన్నారు.

బండి సదానంద్ మాట్లాడుతూ..”టీం వర్క్ తో చేసిన చిత్రమిది. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం” అని అన్నారు.

సహ నిర్మాత గోపాల్ గారు మాట్లాడుతూ..”మా టీమ్ ని ఆశీర్వదించడానికి వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి, ప్రముఖ దర్శకులు సముద్ర గారికి ధన్యవాదాలు. ఈ సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్ సాధించి మాకు మంచి పేరు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.

నటీనటులు
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా, వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత :- ఎం సి రావు ,జి గోపాల్ ,ఎమ్.వి మల్లి ఖార్జునరావు ,కోసూరి సుబ్రహ్మణ్యం ,మని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :- చౌడప్ప
డైరెక్టన్ డిపార్ట్మెంట్ :- సుధీర్ రెడ్డి ,గురునాథం ,వెంకట్ ,శివ
మాటలు :- నివాస్
కెమెరా :- ఆనంద్ మురుకురి
సంగీతం :- సుభాష్ ఆనంద్
ఎడిటర్ :- నందమూరి హరి
బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ :- చిన్న
ఆర్ట్స్ :- రామకృష్ణ
మేకప్ :- శివ
క్యాస్ట్యూమ్స్ :- నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ :- బాబు
పి.ఆర్.ఓ :- హర్ష

Related Posts

Latest News Updates