ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరుగుతున్నాయి. హీరోయిన్లు తమన్నా, రష్మికా ఇతరులు స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్… పాటలతో అభిమానుల్లో తెగ ఊపుతెచ్చాడు. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా అంటూ తమన్నా ఉర్రూతలూగిస్తుంటే… నాటు నాటు పాటలతో రష్మికా ఊపుతెచ్చింది.
అలాగే పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కు కూడా స్టెప్పులు వేసింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు సూపర్ డ్యాన్స్ తో కేక పెట్టించింది. నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు హోస్ట్‌గా వ్యవహరించింది.