భారతీయులకు గుడ్ న్యూస్.. ఆరు నెలల్లోనే గ్రీన్ కార్డు!

అమెరికాలో హెచ్‌`1బీ వీసా కింద పని చేస్తున్న భారతీయ టెక్కీలకు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం తీపి కబురందించింది. గ్రీన్‌ కార్డుల జారీ ప్రక్రియ సమయం తగ్గించాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్‌ నాటికి కేవలం ఆరు నెలల్లో మిగిలి ఉన్న అన్ని గ్రీన్‌కార్డు అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ పూర్తి చేయాలని కూడా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఒకవేళ ఈ సిఫారస్సు అమలుకు నోచుకుంటే భారత్‌, చైనా వంటి దేశాల నుంచి అమెరికాలో జీవనం సాగిస్తున్న వేల మంది ఇమ్మిగ్రెంట్‌ కుటుంబాలకు బెనిఫిల్‌ కానున్నది.

ఇమిగ్రెంట్‌ వీసాపై వచ్చి అమెరికాలో పని చేసే నిపుణులకు శాశ్వత నివాసం కల్పించే ఆఫిషియల్‌ డాక్యుమెంట్‌ ఈ గ్రీన్‌ కార్డు. హెచ్‌`1 బీ వీసాపై వచ్చి పని చేస్తున్న అత్యంత నైపుణ్యం గల ఇండియన్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌..  ప్రస్తుత ఇమిగ్రేషన్‌ పాలసీతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు ప్రతి దేశానికి ఏడు శాతం కోటా ప్రకారమే గ్రీన్‌ కార్డులు జారీ అవుతున్నాయి. గ్రీన్‌ కార్డుల కోసం కొన్ని దశాబ్దాలుగా ఇండియన్‌ ఐటీ నిపుణులు వేచి చూస్తున్నారు.

Related Posts

Latest News Updates