హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది జియో నెట్‌వర్క్. హైదరాబాద్ , బెంగళూరు సిటీలో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది. ఇప్పటివరకు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసిలతోపాటు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో జియో 5జీ నెట్‌వర్క్ సేవలను పరిచయం చేశారు. ముందుగా ఆయా నగరాల్లో యూజర్లను ఇన్వైట్ చేసి.. ట్రయల్ బేసిస్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత సాధారణ యూజర్లకు సైతం ఈ సేవలను పరిచయం చేశారు. తాజాగా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే తరహాలో 5జీ సేవలను అందిస్తున్నట్టు జియో తెలిపింది.టెక్ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది.