అప్పట్లో వరుస సినిమాలు చేస్త ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన నారా రోహిత్ ఇప్పుడు మళ్లీ ప్రతినిధి2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. అయితే ప్రతినిధి సినిమా కూడా పదేళ్ల కిందట ఇదే తేదీన రిలీజ్ కావడం విశేషం.
రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూర్తి టేకింగ్, నారా రోహిత్ ఇంటెన్స్ యాక్టింగ్ అందరినీ మెప్పించింది. దీంతో సినిమా కచ్ఛితంగా హిట్ అవుతుందని ప్రతినిధి2పై మంచి అంచనాలేర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు చాలా మంచి డేట్ దొరికిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. https://cinemaabazar.com/
ఆ రోజున బాక్సాఫీస్ వద్ద ప్రతినిధి2కి పెద్దగా పోటీ లేదని, ప్రమోషన్స్ బాగా చేస్తే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమంటున్నారు. దానికి తోడు సినిమాకు మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లడం పక్కా అని, టిల్లు స్వ్కేర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు మంచి సినిమా రాలేదని, ప్రతినిధి2 ఆ లోటు తీరుస్తుందని అంటున్నారు. ప్రస్తుత రాజకీయాల ఆధారంగా వస్తున్న ఈ సినిమా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రిలీజ్ అవుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. మరి ఈ సినిమా నారా రోహిత్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. https://cinemaabazar.com/