గాడ్ ఫాదర్ హిట్

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం రేపు అంటే విజయదశమికి మెగా ఫాన్స్ ని అలరించడానికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తప్పక హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ చిత్రం మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్. అయితే ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉండ బోతున్నాయి.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆర్. బి. చౌదరి, ఎన్. వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ఘనంగా నిర్మించారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా స్టైలిష్, యువ దర్శకుడిగా పేరు తెచుకున్న మోహన్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దక్షిణ, ఉత్తర భారత దేశాలకు చెందిన ఇద్దరు పెద్ద నటులతో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చిత్రాలం టేనే చూడాలని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఉ వ్విళ్లూరుతున్నారు. సరైన సమయంలో గా డ్ ఫాదర్ చిత్రం విడుదలవుతోంది

చెప్పాలంటే మలయాళ మార్కెట్ కంటే అందునా దక్షిణ భారత దేశంలోనే తెలుగు సినీ మార్కెట్ చాలా పెద్దది. అభిరుచుల పరంగా కూడా వ్యత్యాసం ఉంటుంది. అందుకే మోహనరాజ్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు దశాబ్దాల తరువాత మోహనరాజ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే మలయాళ లూసి ఫర్ స్క్రీన్ ప్లే కంటే దర్శకుడు మోహనరాజ్ వేగవంతమైన స్క్రీన్ ప్లే రాసారని తెలుస్తోంది. మలయాళంలో లేని పది పాత్రలు గాడ్ ఫాథర్లో ఉంటాయని తెలుస్తోంది. రెండు గంటల యాభై నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో చిరంజీవి రెండు గంటలు తెరమీద కనిపిస్తారుట. నయనతార, సత్యదేవ్, మురళి శర్మ, సునీల్, షఫి, బ్రహ్మాజీ నటించిన ఈ చిత్రంలో పూరి జగన్నాధ్ పాత్రికేయుడుగా కనిపించునున్నారని తెలుస్తోంది మొత్తం మీద ఫ్రెష్ స్క్రీన్ ప్లే తో మోహన్ రాజ్ దర్శకత్వం లో తెలుగు, హిందీ భాషల్లో దసరాకానుకగా విడుదలవుతున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని తెలుగు సినీ పరిశ్రమ వర్గాల భోగట్టా.
డాక్టర్ కనకదుర్గ వడ్లమాని
సీనియర్ జర్నలిస్ట్

Related Posts

Latest News Updates