గోవాలో కాంగ్రెస్ కు ఝలక్… 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి

ఓ వైపు పార్టీకి జవసత్వాలు నింపడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరుగుతున్నారు. ఈ సమయంలోనే గోవాలో ఆ పార్టీకి పెద్ద ఝలక్ తగిలింది. మొత్తం 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వుండగా… ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. మాజీ సీఎం దిగంబర్ కామత్ సారథ్యంలో వారందరూ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కమలం పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ప్రధాని మోడీ, సీఎం ప్రమోద్ సావంత్ లను బలోపేతం చేసేందుకే బీజేపీలో చేరామని మైఖేల్ లోబో తెలిపారు. వీరందరూ సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్ కు పంపారు. దీంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది. దీంతో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది.

 

గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్కు 11 మంది సభ్యులున్నారు. 2019 జులైలోనూ.. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే వార్తలు వచ్చినా..అధిష్టానం చర్యలతో అది సద్దుమణిగింది.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్