‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్‌తో దేశంలోని అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చేరింది హోంబలే ఫిలింస్. విజయ్ కిరగందూర్ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ.. గడిచిన దశాబ్ద కాలంలో అంచెలంచెలుగా ఎదిగింది. ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కన్నడ సినీ పరిశ్రమ.. ఆ తరవాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తోంది. అయితే, దసరా సందర్భంగా కన్నడలో విడుదలైన ఒక చిన్న చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కన్నడలో వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఆ సినిమానే ‘కాంతార’. తెలుగులో కూడా విడుదలవుతోంది. వచ్చే శుక్రవారం ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండియన్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఓ వైపు ‘సలార్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు, మంచి కంటెంట్‌తో కూడి చిన్న సినిమాలను సైతం హోంబలే ఫిలిం నిర్మిస్తోంది. అలా నిర్మించిన ఓ సినిమా ప్రస్తుతం కన్నడ నాట వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో కలిసి హోంబలే ఫిలింస్ ‘కాంతార’ అనే సినిమాను చేసింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా కర్ణాటకలో మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కన్నడ మూలాలను ఎంతో రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించారని కన్నడిగుల మాట. మనిషికి, ప్రకృతి మధ్య జరిగే సంఘర్షణతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కాన్సెప్ట్. కాకపోతే, రిషబ్ శెట్టి తన రైటింగ్, డైరెక్షన్‌తో మాయ చేశారు. సినిమా పిక్చరైజేషన్, ఆర్ట్ వర్క్, నేపథ్య సంగీతం.. ఇలా అన్నీ కలిపి ఒక రియలిస్టిక్ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించారు. హోంబలే ఫిలింస్ నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత వన్నెతెచ్చాయి.కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని హోంబలే ఫిలింస్ నిర్ణయించింది. అయితే, ఈ సినిమా గురించి విన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అస్సలు ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. సినిమా చూసి తెలుగులో విడుదల చేయడానికి రెడీ అయిపోయారు. ‘కాంతార’ను కొనుగోలు చేసి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈనెల 15న ‘కాంతార’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరాకు తెలుగులో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘గాడ్ ఫాదర్’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి వచ్చే వారాంతానికి ఈ రెండు సినిమాలు థియేటర్లను ఖాళీ చేస్తాయి. వచ్చే వారం తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కావడం లేదు. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ లాంటి చిన్న సినిమాలే ఉన్నాయి. కాబట్టి, ఇది ‘కాంతార’కు కలిసొస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన అల్లు అరవింద్.