గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను ఎన్ కౌంటర్ చేసిన ఎస్టీఎఫ్

గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ యూపీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. యూపీలోని ఝాన్సీ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అహ్మద్ తో పాటు గులామ్ అనే వ్యక్తి కూడా మరణించాడు. వీరిద్దరి వద్ద నుంచి అధునాతన విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని యూపీ ఎస్టీఎఫ్ పేర్కొంది.

 

ఉమేష్ పాల్ హత్య కేసులో అటు అహ్మద్ కి, ఇటు గులామ్ కి ప్రమేయం వుంది. వీరిపై 5 లక్షల రివార్డు కూడా వుంది. బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా వున్న ఉమేశ్ పాల్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ నిందితుడిగా వున్నాడు. ప్రస్తుతం సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులను డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య అభినందించారు.

 

గ్యాంగ్ స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను యూపీ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్ చేసింది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను అభినందించారు. యూపీలో శాంతిభద్రతలను కాపాడేందుకు పనిచేస్తున్న అధికారులను సీఎం యోగి అభినందించారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో యూపీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

 

ఈ సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్, యూపీ ఎస్టీఎఫ్, డీజీపీ, స్పెషల్ డీజీపీ శాంతిభద్రతలు తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఎన్ కౌంటర్ వివరాలను ముఖ్యమంత్రి యోగికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ వివరించారు. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను అభినందించారు.

Related Posts

Latest News Updates