పాటల రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన కృష్ణ చైతన్య ఛల్ మోహనరంగ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి చాలా టైమే పట్టింది. నితిన్ తో పవర్ పేట చేయాలని అన్నీ రెడీ చేసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసి ఇక రేపో ఎల్లుండో సినిమా సెట్స్ కు వెళ్లడమే లేటనుకున్న టైమ్ లో బడ్జెట్ ఇష్యూస్ వల్ల పవర్ పేటకు బ్రేక్ పడింది.
ఇక ఆ తర్వాత శర్వానంద్ తో కృష్ణ చైతన్య సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్ల పాటూ ప్రచారం జరిగింది. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. మొత్తానికి తన తర్వాతి సినిమాను విశ్వక్సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చేసి రేపే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా ఈషా రెబ్బాను అనుకుని ఆ తర్వాత ఆయేషా ఖాన్ తో చేయడం అప్పట్లో బాగానే చర్చనీయాంశమైంది. వీటిపై కృష్ణ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను ముందు శర్వానంద్ తోనే చేద్దామనుకున్నట్లు చెప్పిన కృష్ణ చైతన్య, దానికి ముందే శర్వా రణరంగం లాంటి ఎమోషనల్ సినిమా చేయడంతో తర్వాత చేద్దామన్నాడని, దాంతో కొన్ని రోజుల తర్వాత విశ్వక్ ను కలిసి అతనితోనే సినిమా చేద్దామని డిసైడైనట్లు చెప్పాడు. ఇక ఐటెం సాంగ్ ను ఈషారెబ్బాతో ఓ రోజు షూట్ చేసినట్లు, తర్వాత ఈషాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల వేసిన ససెట్స్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆయేషాతో ఈ సాంగ్ చేశామని, ఇదంతా ఈషాతో మాట్లాడాకే చేశామని క్లారిటీ ఇచ్చాడు కృష్ణ చైతన్య.