హైద్రాబాద్ లో అత్యంత కీలకమైన గణేష్ నిమజ్జనోత్సవం నేడే జరగనుంది. ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఏటా బాలాపూర్ గణేశ్ విగ్రహ శోభాయాత్ర మొదలైన తర్వాతే… నగరంలోని అన్ని చోట్లా శోభాయాత్రలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈసారి కాస్త ముందుగానే యాత్రను ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బాలాపూర్‌‌ గణనాథునికి ఉదయం 5 గంటలకు చివరి పూజలు చేసి ఊరేగిస్తారు. ఉదయం 10 గంటలకు లడ్డూ వేలం ఉంటుంది. హనుమాన్‌‌ టెంపుల్‌‌ లో ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్ర మొదలవుతుంది.

 

మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది., గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు GHMC అధికారులు తెలిపారు. కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశామని అన్నారు. వ్యర్థాల తొలగించేందుకు 20 జేసీబీలు ఏర్పాటు సిద్ధం చేశారు.168 యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. 24 వేల మంది పోలీసులు నిమజ్జన బందోబస్తులో పాల్గొంటున్నారు. 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

 

మధ్యాహ్నానికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం

ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనం శుక్రవారం మధ్యాహ్నం లోపే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నమే బడా గణపతి చుట్టూ ఉన్న కర్రలు తొలగించి భారీ క్రేన్‌‌తో కనెక్ట్‌‌ చేశారు. ఉదయం 5 గంటలకు పూజలు చేసి 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభిస్తారు. టెలిఫోన్‌‌ భవన్‌‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్​ రూట్‌‌లో ఎన్టీఆర్ మార్గ్ కు తరలిస్తారు. క్రేన్‌‌ నంబర్‌‌‌‌ 4 వద్ద బడా గణేశ్​ నిమజ్జనం చేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.