ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ *గేమ్ ఆన్*
కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం *గేమ్ ఆన్*. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్ చెప్పిన విశేషాలు.
“స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. *హ్యాపీ డేస్* సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. *ఏం మాయ చేసావే* సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా . అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చిత్రీకరించాను. తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. అక్కడే ప్రొడక్షన్, సౌండింగ్ గురించి నేర్చుకున్నాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉండాలనుకున్నా. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు.
ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్.
రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ గా ఉంటుంది. ఆదిత్యామీనన్ గారిది చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఇందులో సైకలాజికల్ డాక్టర్ గా ఆయన నటించారు. ఆయన యాక్టింగ్ లో చాలా షేడ్స్ కనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ గారు మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వీరంతా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది.
నిర్మాత రవి కస్తూరి గారికి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు.
ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో సెకండ్ షెడ్యూల్ నుంచి బడ్జెట్ పెంచి ఇంకా బాగా తీయాలనుకున్నాం. చాలా రియలిస్టిక్ గా సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. తక్కువ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు.
గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః నవాబ్ గ్యాంగ్, అశ్విన్ – అరుణ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్; స్క్రిప్ట్ సూపర్ వైజర్ : విజయ్ కుమార్ సి.హెచ్ ; ఎడిటర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠల్; యాక్షన్ కొరియోగ్రఫీః రామకృష్ణ. నభా స్టంట్స్; స్టైలింగ్ః దయానంద్; పిఆర్ఓః జి.కె మీడియా; కొరియోగ్రఫిః మోయిన్; నిర్మాత: రవి కస్తూరి; కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరక్షన్: దయానంద్