సాంగ్ తో తిరిగి స్టార్ట్ కానున్న ‘గేమ్ ఛేంజర్’

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. ఐతే, ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ జనవరి 17వ తేదీ నుంచి ఓ సాంగ్ తో తిరిగి ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. చరణ్ – కియరా అద్వానీ పై ఓ లవ్ సాంగ్ ను శంకర్ డిజైన్ చేశారట. ఇక బాచుపల్లిలో గత శనివారంతో 3 రోజుల షెడ్యూల్ ముగిసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో చరణ్ ను కూడా వినూత్నంగా చూపించబోతున్నాడు.

కాగా ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు మరో కథానాయిక అంజలి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పొలిటికల్ డ్రామాలో శంకర్ ప్రెజెంటేషన్ కోసం అయితే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తన 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జయరామ్, SJ సూర్య, సునీల్, శుభలేఖ సుధాకర్, బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.

Related Posts

Latest News Updates