అమ్మవారి శరన్నవరాత్రులలో నాల్గవ రోజు (కూష్మాండ దేవీ) శ్రీ అన్నపూర్ణాదేవీ….

అమ్మవారు అన్నపూర్ణాదేవి గా భారతదేశం లో ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. మన దేశ ప్రజలందరికీ దాహాన్ని గంగమ్మ తీరిస్తే, ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. భారత దేశంలో ప్రజలకు ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కధ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంధాలు, పురాణాల ప్రకారం… ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా భారతదేశంలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు. అన్నపూర్ణ దేవి. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన ఉంటుంది. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.!!
మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates