నోయిడాలో కూలిన సరిహద్దు గోడ.. నలుగురి దుర్మరణం

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో రెసిడెన్షియల్ సొసైటీ సరిహద్దు గోడ కూలిపోయింది. దీంతో నలుగురు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో 9మంది గాయపడ్డారు. నోయిడాలోని సెక్టార్ 21లోని పెద్ద గృహ సముదాయమైన జల్ వాయు విహార్ వద్ద జరిగిన ఈ ఘటనలో శిథిలాలను తొలగించేందుకు బుల్డోజర్లు చేరుకున్నాయి. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో సీనియర్ అధికారులతో సహా అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని నోయిడా అథారిటీ ప్రకటించింది. మరోవైపు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీనియర్‌ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.

Related Posts

Latest News Updates