త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేవ్ ఇంటికి నిప్పు….త్రిపురలో టెన్షన్ టెన్షన్

త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేవ్ పూర్వీకుల ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అలాగే ఇంట్లో వున్న అర్చకులపై దాడికి దిగారు. దీంతో ఉదయ్ పూర్ లోని జంజూరీ ప్రాంతంలోని రాజధర్ నగర్ లోని బిప్లబ్ దేవ్ పూర్వీకుల ఇంటికి నిప్పుపెట్టి, వాహనాలను ధ్వంసం చేసేశారు. చుట్టు పక్కల వారు, స్థానికులు అర్చకులను రక్షించడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంత విధ్వంసం జరగడంతో త్రిపురలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు దీనిపై బీజేపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. సీపీఎం నేతలే ఈ పని చేశారని, మాజీ సీఎం ఇంటికి నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారితో సీపీఎం ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి సమావేశమయ్యారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి నిరుపమ్ దెబ్బర్మ, అదనపు ఎస్పీ దేబంజన రాయ్ సంఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపు చేశారు. అయితే.. ఇంటి పక్కనే వున్న ఇతర వాహనాలు, బీజేపీ జెండాలను తగులబెట్టారు.

Related Posts

Latest News Updates