రోడ్డు ప్రమాదంలో టాటా మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత

టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) కన్ను మూశారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబై వెళుతుండగా  పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్‌ టైకూన్‌ మృత్యువాత పడ్డారు.  అహ్మదాబాద్‌ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాల్గర్‌ సమీపంలోని చరోటి దగ్గర సైరన్‌ ప్రయాణిస్తున్న కారు అదుపతప్పి డివైడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా పాల్ఘర్‌ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికీ చాలా స్పీడ్‌గా కారును డ్రైవ్‌ చేశాడు డ్రైవర్‌. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నారు. సైరస్‌ తోపాటు మరొకరు కూడా  ఈ యాక్సిడెంట్‌లో మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి గాయలైనట్లు సమాచారం. వీరిని సమీపంలోని  ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్‌ మిస్త్రీ లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌సీ చేశారు. 2006 నుంచి టాటా సైన్స్‌కు డైరెక్టర్‌గా  పని చేశారు. 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2012లో రతన్‌ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్‌కు సైరస్‌ మిస్త్రీ చైర్మన్‌ అయ్యారు. సైరస్‌ మిస్త్రీ తన పనితీరుతో మెప్పించలేకపోయారు. టాటా కంపెనీలన్నింటీని అమ్మేయడం మంచిదన్నట్లుగా ఆయనతీరు ఉండటం. చివరికి టీసీఎస్‌ విషయంలో ఆయన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూండటంతో టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మ్సిర్తీని తొలగిస్తూ టాటా గ్రూప్‌ నిర్ణయం తీసుకుంది.

Related Posts

Latest News Updates