బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో గిరిధర్ గమాంగ్కి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.

రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రారంభం నుంచి కూడా అంతా శుభఫలితాలే కలుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నేతలను కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ నేతలతో పాటు ప్రస్తుతం ఇతర పార్టీలలో కొనసాగుతున్న అసంతృప్త నేతలను కూడా బీఆర్ఎస్లో చేరాలని కోరుతున్నారు

Related Posts

Latest News Updates