బలవంతపు మత మార్పిళ్లు దేశ భద్రతకే ముప్పు : సుప్రీం

హిందువులే టార్గెట్ గా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మత మార్పిళ్లు దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంది. వీటిని నివారించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, వీటిని అరికట్టకపోతే క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటామని పేర్కొంది.

 

బలవంతపు మత మార్పిళ్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మత మార్పిళ్లను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.

Related Posts

Latest News Updates