దేశంలోనే తొలిసారి.. భారత వైద్య శాస్త్రంలో అద్భుతం

భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా మహిళలు గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. కాగా వారిలో 65 శాతం మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిల్లోమావైరస్‌ వ్యాక్సిన్‌ ను సెప్టెంబర్‌ 1న విడుదల చేశారు. గర్భాశయ క్యాన్సర్‌ 90 శాతం ఒకే ఒక నిర్ధిష్ట వైరస్‌ వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ ఆ వైరస్‌కి వ్యతిరేకంగా పనిస్తుందట.  సీరం ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే వ్యాక్సిన్‌ ని రూపొందించింది. గర్భాశయ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా మనదేశంలో వ్యాక్సిన్‌ తయూరు చేసే బాధ్యతను డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది జులై నెలలో సీరం ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది. ఢల్లీిలోని ఐఐసీలో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ వ్యాక్సిన్‌ని ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్‌ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లు ఆయన తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిల్లోమావైరస్‌ వ్యాక్సిన్‌ను మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రారంభించారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్