దేశంలోనే మొట్టమొదటి సారిగా… సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు

భారత్‌ త్వరలో సముద్ర గర్భంలో బుల్లెట్‌ రైలు దూసుకుపోనున్నది. ముంబై` అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కోసం సముద్రం అడుగున 7 కిలోమీటర్లు టన్నెల్‌ నిర్మించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) బిడ్లను ఆహ్వానించింది.  2023 జనవరి 19 వరకు బిడ్లు వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టేందుకు 21 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ లో 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో నిర్మించనున్నారు. దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ టన్నెల్‌ను థానే క్రీక్‌ వద్ద నిర్మించనున్నారు.

Related Posts

Latest News Updates