పినరయ్ విజయన్ సర్కారుకు గట్టి షాకిచ్చిన హైకోర్టు

కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది. స్టేట్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కొట్టేసింది. దీంతో పినరయ్ విజయన్ సర్కారుకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని రోజులుగా యూనివర్శిటీల విషయంలో గవర్నర్ కు, సీఎం స్టాలిన్ కు మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వీసీగా డాక్టర్ రిజి జాన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిని హైకోర్టు కొట్టేసింది. ఈ నియామకం చట్ట విరుద్ధమని, యూజీసీ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొంది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కొత్త వీసీ నియామకాన్ని చేపట్టాలని ఛాన్సలర్ ఆఫ్ యూనివర్శిటీస్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ పదవిలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ వున్నారు.

 

గవర్నర్ గత నెలలో తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వారిని తమ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో కేరళ యూనవిర్శిటీల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మొదలైంది. ఇందుకు ప్రతిగా, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించి, దానిపై సంతకం చేయడానికి గవర్నర్‌కు పంపింది. ఇది తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ అని, తనకు తానుగా తీర్పు చెప్పలేనందున రాష్ట్రపతికి పంపిస్తానని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.

Related Posts

Latest News Updates