హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నచిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. అక్టోబరు 28న ఈ మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలకానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా… హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ : “ఫోకస్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు సూర్యతేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. హీరో విజయ్ శంకర్ చాలా బాగా పెర్‌ఫామ్ చేశాడు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ నెల 28న థియేటర్లో విడుదలవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్న వీరభద్రరావు గారికి, మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ : “నా కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఫోకస్. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసిన శ్రీకాంత్ అన్న కి చాలా థాంక్స్. ఈ మూవీ కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్. ఈ జోనర్‌ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. అంత చక్కగా డైరెక్టర్ సూర్యతేజగారు ఈ సినిమాని డిజైన్ చేశారు. అక్టోబరు 28న విడుదలవుతున్న ఫోకస్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా“అన్నారు
చిత్ర నిర్మాత వీరభద్రరావు పరిస మాట్లాడు
చిత్ర దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ – “ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. తెలుగు ఆడియన్స్ ఈ జోనర్‌ను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కొత్తగా ఉంటే తప్పకుండా ఓన్ చేసుకుంటారు. ఊహించని మలుపులతో సరికొత్త కథ,కథనాలతో ఈ సినిమా రూపొందింది. ఈ నెల 28న విడుదలవుతున్న ఫోకస్ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా“ అన్నారు స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.