విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో భారీ ప్రమాదం… ఇద్దరు దుర్మరణం

విజయవాడ గాంధీ నగర్ లోని జింఖానా మైదానంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మొత్తం 15 టపాసుల దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. కొన్ని దుకాణాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరోవైపు 4 ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

Related Posts

Latest News Updates