సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం దగ్గర్లో వున్న రూబీ లగ్జరీ ప్రైడ్ హోటల్ లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 8 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ-స్కూటర్‌ షోరూమ్‌లోని బ్యాటరీలు పేలడంతో ఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూబీ హోటల్ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరి ఆడక లాడ్జిలో బస చేసిన వారు కూడా చనిపోయారు.

అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి జాబితా…

అల్లాడి హరీశ్… విజయవాడ
వీరేంద్ర కుమార్… ఢిల్లీ
సీతారామన్… చెన్నై
బాలాజీ… చెన్నై
రాజీవ్ మైక్… ఢిల్లీ
సందీప్ మాలిక్… ఢిల్లీ ….

గాయపడిన వారి జాబితా

సంతోష్.. పెందుర్తి
జయంత్… బెంగళూరు
దేబాశిష్ గుప్తా… కోల్ కత్తా
యోగిత…. పెందుర్తి
కేశవన్.. చెన్నై…
దీపక్ యాదవ్…. హర్యానా
ఉమేశ్ కుమార్…. కోల్ కతా
మన్మోహన్ ఖన్నా… హైదరాబాద్
రాజేశ్ జగదీశ్… గుజరాత్