షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై లక్నోలో కేసు నమోదు

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది.గౌరీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్  కంపెనీ, తన నుంచి  రూ. 86 లక్షలు వసూలు చేసినప్పటికీ ఫ్లాట్‌ను అప్పగించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న గౌరీ  ప్రభావంతోనే తాను ఆ ఫ్లాట్‌ను కొనుగోలు చేశానని జస్వంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో  గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద పోలీసులు  కేసు నమోదు చేశారు.

 

గౌరీ ఖాన్, తులసియానీ కంపెనీ ఎండీ, డైరెక్టర్‌పై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జశ్వంత్‌ ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, గౌరీ ఖాన్‌లపై అక్రమాస్తుల సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుశాంత్ గోల్ఫ్ సిటీ సీఐ శైలేంద్ర గిరి తెలిపారు.

Related Posts

Latest News Updates