మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్…. పార్లమెంట్ కి చేరుకున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మరి కాసేపట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో అందరి చూపూ కేంద్ర బడ్జెట్ పైనే వుంది. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల కల్లా నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కి చేరుకున్నారు. మరోవైపు బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. 11 గంటలకు లోకసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

దేశంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ వుంటుందని ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. అలాగే రూపొందించామని కూడా ప్రకటించారు. అయితే… ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఎవరెవరికి ఏమోమి వస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే సంవత్సరమే సార్వత్రిక ఎన్నికలలు వుండటం… ప్రపంచ ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. ఎలాగూ పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి…. మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రసంగం ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్. ప్రజలపై పన్నుల భారం మోపకుండా, మరిన్ని వనరులను సమకూర్చుకోవడం, ప్రణాళికలు రూపొందంచడం వంటి విషయాలపై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా? అని వేచి చూస్తున్నారు.

Related Posts

Latest News Updates