వైభవంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాలు

కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు. కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట.

ఈ క్రమంలోనే కార్తీక మాసం పురస్కరించుకుని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 24 నవంబర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్వాడలోని కేఎల్ఎన్ రాజు ఫార్మ్ హౌస్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మహిళా సభ్యులు, వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి స్పాన్సర్ సిద్ధార్థ జ్యువెలర్స్ కృష్ణప్రసాద్ వేమూరి, నాగిని ప్రసాద్ వేమూరి విజేతలకు బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీ కేఎస్ రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎన్ రెడ్డి గారు, సెక్రెటరీ శ్రీ తుమ్మల రంగారావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ సదాశివరెడ్డి గారు, కమిటీ మెంబర్లు కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, వీ.వీ.జి. కృష్ణంరాజు, భాస్కర్ నాయుడు, కోగంటి భవానీ ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాట్లు దగ్గరుండి చేశారు. ఇక ఎఫ్ఎన్సీసీ కల్చరల్ కమిటీ చైర్మన్ ఏ. గోపాలరావు, అడిషనల్ చైర్మన్ సురేష్ కొండేటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి.

Related Posts

Latest News Updates