సినీ గేయ రచయిత, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన కూతురు సినిమాకు ఆయన తొలి గీతాన్ని రాశారు. సూపర్ హిట్ సినీ వార పత్రికలో చాలా సంవత్సరాలు సినీ పాత్రికేయునిగా పనిచేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే పతంజలి పత్రికలో పనిచేశారు. కారాతో పాటు.. చాలా మంది సాహితీ వేత్తలతో ఆయన స్ఫూర్తి పొందారు. పాత్రికేయునిగా పని చేస్తున్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఏర్పడింది. కృష్ణ వంశీ చందమామ చిత్రంలో కూడా పాటలు రాశారు. దీనితో పాటు చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో కూడా పాటలు రాశారు. వీటితో పాటు ప్రస్తుతం భరత్ అనే మూవీకి కూడా పాటలు రాశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాడ మూర్తి… మంగళవారం కన్నుమూశారు.












