బల్కంపేట్‌ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం

హైదరాబాద్ బల్కంపేట్‌ ఎల్లమ్మ అమ్మవారిని దర్శనకి విచ్చేసిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం గారికి ఆలయ పాలక మండలి సభ్యులు సరఫ్‌ సంతోష్‌ గారు స్వాగతం పలికి, పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం ఆయనకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరిపైనా అమ్మదీవెనలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లాల శ్రీనివాస్ యాదవ్, నరేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, బత్తిని వినయ్, దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates