95వ అకాడమీ (Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అకాడమీ అవార్డ్ దేశానికే గర్వకారణమని అన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్ & కాలభైరవ, పాట రచయిత చంద్రబోస్, నృత్య దర్శకుడు ప్రేమరక్షిత్ మరియు చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
RRR సినిమా చరిత్ర నెలకొల్పింది. ప్రతీ తెలుగువాడు, ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన సమయమిది. RRR సినిమాలోని మోస్ట్ పాపులర్ పాట నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డు వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి.













