కుటుంబ వ్యవస్థను కాపాడుకోగలమా?

కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు..అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది.ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్టపడటం లేదు. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు.నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.
కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు:
అతి తెలివి, చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం(ఓపిక) లేకపోవడం,
అందరూ సమానమే అనే వింత భావన పెరగటం (డెమాక్రసి).
పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.
ఎంతసేపూ వికృత హాస్యపు ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.
ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.
ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా,దృఢంగా ,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.
ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.
అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా , ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.
అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30,40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.
ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.
మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.
మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.
కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.
మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు.
నేను నా భార్య/ భర్త అనే సిద్దాంతం పోయి “నేనే
నేను “” నేను నేనే”
పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.
కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చే శా యి. అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ , భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు.
సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో, ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు. దీనికి అందరూ అతీతులే. ఇక్కడ ఎవ్వరూ శ్రీరామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు.
ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప మనం మాత్రం మారం కదా…. కుటుంబ వ్యవస్థను కపాడుకుంటే తరతరాలకు మంచి కుటుంబాన్న ఇవ్వ వచ్చు అనేదే ఈ అంశం.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates