అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. చరిత్రలోనేఆయనపై నేరారోపణలను రుజువైనట్లు న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ దృవీకరించింది. దీంతో అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా నేరారోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. దీంతో ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. మహిళను డబ్బుతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్ పై ఆరోపణలు రాగా… న్యూయార్క్ గ్రాండ్ జూరీ ధ్రువీకరించింది. ట్రంప్ లొంగిపోతే… ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్ట్రోమీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ తో తనకున్న శారీరక అక్రమ సంబంధం బయటపడకుండా ఆమెకు డబ్బు ఇచ్చి, అనైతిక ఒప్పందం చేసుకున్నారన్నది ట్రంప్ పై వున్న అభియోగం.ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఆమె 2018లో కోర్టును ఆశ్రయించింది. అయితే ట్రంప్ ఈ ఆరోపణలను అప్పట్లో కొట్టిపారేశారు. తనపై తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండటంతో హైప్రొఫైల్ కేసుగా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని ,ఆందోళనలకు సిద్ధం కావాలని ట్రంప్ ఈ మధ్య తన అనుచరులకు పిలుపునిచ్చారు.