మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా అరెస్ట్… 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు

ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకు నుంచి 42 కోట్ల 79 లక్షలు లోన్ తీసుకుని దారి మళ్లించారని ఆమె పై కేసు నమోదు చేశారు . లోన్ తీసుకొని ఇప్పటి వరకూ తమకు చెల్లించలేదని పీఎన్బీ ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఆమెను అరెస్ట్ చేసింది.

 

అరెస్ట్ తర్వాత ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆమెను బెంగళూరుకు తరలించినట్లు వార్తలొచ్చాయి. కానీ… ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. పీఎన్బీని మోసం చేసినందుకు గాను ఆమెకు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె భర్త రామక కోటేశ్వర రావుకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సీబీఐ కోర్టు పేర్కొంది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్