తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంట సేపు జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా వున్నారు. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి, సోమేశ్ కుమార్ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. వీఆర్ఎస్ తర్వాత… తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తారని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే… అలాంటిదేమీ లేదని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పజెప్పినా… బాధ్యతగా చేస్తానని సోమేశ్ ప్రకటించారు.
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. జాయినింగ్ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిగా… ఏపీ సర్కార్ తనకి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ అదేశాల ప్రకారమే తాను నడుచుకుంటానని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమేశ్ కుమార్కు ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ను వెంటనే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి కుమారిని సీఎస్ గా నియమించింది. దీంతో సోమేశ్ ఏపీ కేడర్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఏపీ సర్కార్ ఏ బాధ్యతలను అప్పగిస్తుందో చూడాలి. అయితే… తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారునిగా వెళ్లనున్నారా? అంటూ ప్రశ్న అడగ్గా… నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ఏ పని ఇచ్చినా.. పని చేస్తానని సోమేశ్ కుమార్ అన్నారు.