పాస్టర్లు, నన్స్ కూడా అందరిలాగే అశ్లీల చిత్రాలను చూస్తారని పోప్ ఫ్రాన్సిన్ వెల్లడించారు. వీరందరికీ ఇదో దురలవాటుగా అయ్యిందని, దయ్యాలు మాత్రమే అశ్లీల చిత్రాలను చూస్తాయని అన్నారు. సెల్‌ఫోన్‌ల వంటి ఆధునిక ప్రపంచంలోని సాంకేతికతలను ఉపయోగించాలా? అని చర్చి విద్యార్థి ఒకరు అడగడంతో పోప్ పై విధంగా స్పందించారు. పిల్లలపై అశ్లీల చిత్రాలు ఎలాగూ ప్రభావం చూపిస్తున్నాయని, కానీ.. పాస్టర్లు, నన్స్ విషయంలో సాధారణమైపోయిందని నిర్మొహమాటంగా చెప్పేశారు. అశ్లీల చిత్రాలను మొబైల్స్ నుంచి తొలగించాలని పోప్ సూచించారు.ఇలాంటి దురలవాటు హృదయాలను బలహీన పరుస్తుందని హెచ్చరించారు.
