భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టీ నియమితులయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎరిక్ మాట్లాడుతూ నన్ను ఎంపిక చేసిన చట్టసభ సభ్యులు, అధ్యక్షుడు బైడెన్‌కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలు మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తా అని తెలిపారు. కాగా, ఎరిక్ గతంలో లాస్ఏంజెలిస్ మేయర్‌గా పనిచేశారు.