‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ మూవీ నుంచి ‘ఏంటమ్మ.. ఏంటమ్మ’ సాంగ్ రిలీజ్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమాలోని ఏంటమ్మ.. ఏంటమ్మ… అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. దీంట్లో రాంచరణ్ కూడా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ లో రాంచరణ్, సల్లు భాయ్, వెంకటేష్ తో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ పాటకు డ్యాన్స్ చేయడం పట్ల రాంచరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్స్ కలిసి డ్యాన్స్ చేయడం తన లైఫ్ లో మరిచిపోని ఘటన అని అన్నారు.

‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లోని ‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ తెలుగు సినీ అభిమానులకు స్పెషల్ ట్రీట్‌ అనే చెప్పాలి. ఒకేసారి ముగ్గురు స్టార్లు కాలు కదపడంతో ఈ పాటను చూసి, మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్‌చరణ్ స్టైలిష్ ఎంట్రీ అదిరిపోయింది. విడుదల తర్వాత పెద్ద తెరపై ఈ పాట కచ్చితంగా ఆకట్టుకుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates