బి.ఎ.రాజు…సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో చక్రం తిప్పటం ఆయనకే సాధ్యమైంది. సూపర్‌స్టార్ కృష్ణ నుంచి అందరి అగ్ర హీరోలతో పని చేసిన అనుభవం ఆయనకే సొంతం. అందరినీ కలుపుకునిపోతూ వివాదాలకు దూరంగా ఉంటూ అజాత శత్రువగా తనదైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు.
https://twitter.com/i/status/1792772783631646979
చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ… ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండేది. ఆయన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ దర్శకుడు ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా టక్కున చెప్పేవారు. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. మే 21న ఆయన 3వ వర్ధంతి. ఈ సందర్భంగా ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నాం.
