హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా ‘ఏం చేస్తున్నావ్’ టీజర్ గ్రాండ్ రిలీజ్ వేడుక

NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాక్టర్ మధు మాట్లాడుతూ.. డైరెక్టర్ భరత్ తాను స్నేహితులమాని చెప్పారు. భరత్ సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పడంతో నేను చేయగలనా అనే డౌట్ వచ్చింది. తర్వాత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేశానన్నారు.

చిన్న సినిమాలకు ఉండే కష్టాలు అందరికీ తెలిసిందేనని, ఏం చేస్తున్నావ్ సినిమా చేస్తున్నప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయని, వాటిని అధిగమించి ఈరోజు ప్రెస్ మీట్ జరుపుకోవడం సంతోషంగా ఉందని డైరెక్టర్ కి థాంక్స్ చెప్పారు డిఓపి ప్రేమ్.

అశోక్ మాట్లాడుతూ.. నేచురల్ యాక్టర్ శ్రీ విష్ణుకి థాంక్స్ చెప్పారు. చిన్న సినిమాలను సపోర్ట్ చేయడం చాలా సంతోషం అన్నారు. అలాగే ఏం చేస్తున్నావ్ సినిమా నిజాయితీ గా తెరకెక్కించామన్నారు. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు.

నటి సాయి ప్రసన్న మాట్లాడుతూ.. సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ ఉందని చెప్పినప్పుడు నాకు ఈ చిత్రం గురించి ఏమీ తెలియదన్నారు. షూటింగ్ సమయంలో డైరెక్టర్ భరత్ విజన్ చూసి మెస్మరైజ్ అయ్యానని, సినిమాలో ఇంకా ఎక్కువ క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపించిందన్నారు. చేసినంతవరకు నా బెస్ట్ ఇచ్చానని అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్ కి థాంక్స్ చెప్పారు.

యాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాలు తెరకెక్కించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని, సాహసించి చిత్రాన్ని పూర్తిచేసి విడుదల చేస్తున్నందుకు టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

పాటల రచయిత భరద్వాజ్ మాట్లాడుతూ.. ఇది నాకు ఎంతో స్పెషల్ మూమెంట్ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా బ్రోచేవారెవరు చిత్రానికి రచయితగా పనిచేయడం, మళ్ళీ ఇన్నాళ్ళకి శ్రీ విష్ణు ముఖ్యఅతిథిగా వచ్చిన ఏం చేస్తున్నావు చిత్రానికి కూడా లిరిక్స్ రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాటలు చాలా బాగున్నాయి సినిమా కూడా చాలా బాగుంటుంది అని తెలిపారు. డైరెక్టర్ భరత్ గురించి మాట్లాడుతూ… అతను షార్ట్ ఫిలిమ్స్ తీసే అప్పటినుంచి పరిచయమని, ఇద్దరూ కలిసి స్క్రిప్టులు రాసేవారన్నారు. యూట్యూబ్ లో భరత్ తీసిన ‘ఇండియాస్ డాటర్’ షార్ట్ ఫిలింకు అప్పట్లోనే 5 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయని, తాను చాలా మంచి డైరెక్టర్ అని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా. తన సొంత తమ్ముడు విజయ్ రాజ్ కుమార్ హీరోగా పెట్టి ఈ సినిమాను దర్శకత్వం చేయడం అనేది చాలా సంతోషంగా ఉందన్నారు.

మసుద సేమ్ బాంధవి శ్రీధర్ మాట్లాడుతూ.. ఏం చేస్తున్నావు టీజర్ చాలా బాగుందని యూత్ కి ఎంతో బాగా కనెక్ట్ అవుతుందని తెలిపారు. నిర్మాత కిరణ్ కురువ మాట్లాడుతూ సినిమా అందరికీ బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ కి థాంక్స్ చెప్పారు.

ఏం చేస్తున్నావ్ సినిమా డైరెక్టర్ భరత్ మిత్ర మాట్లాడుతూ.. మొదటగా హీరో శ్రీ విష్ణుకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం సమయం కేటాయించి టీజర్ లాంచ్ కు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుందని మంచి సినిమా తీశామని చెప్పారు థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వెళ్తారని తెలిపారు. సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు సినిమా పీఆర్వోలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సినిమా మస్త్ ఉంటదని, ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకొని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ రాజ్ కుమార్ తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఉంటుందని, హాలీవుడ్ సినిమాలో కూడా చూడని ఒక హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పారు. టీజర్ లాంచ్ కు వచ్చిన హీరో శ్రీ విష్ణుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక డైరెక్టర్ భరత్ మిత్ర తాను అన్నదమ్ములని ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేనని పేర్కొన్నారు.

ఏం చేస్తున్నావ్ నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ఇందులో చాలా అర్థాలు ఉంటాయని, ఇది చాలా మంచి టైటిల్ అని టీజర్ కూడా బాగుందన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. ఈ సినిమా వేడుక చూస్తుంటే తనకు బ్రోచేవారెవరు, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయని.. కొత్త వాళ్ళందరూ ఇలానే ఎదుగుతారని వారి థాట్స్, వారి మాటలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు. అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్తవాళ్లు విజయం సాధించాలని, కొత్తవాళ్లు సక్సెస్ అయితే తనకు సంతోషమని అన్నారు. చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కొంచెం కష్టం, కానీ మీడియా సపోర్ట్ చేస్తే అదేమంత కష్టం కాదని తనకు సపోర్ట్ చేసినట్లే ‘ఏం చేస్తున్నావ్’ చిత్ర యూనిట్ కు కూడా మీడియా సపోర్ట్ చేయాలని కోరారు. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉందని, మంచి స్టోరీ టెల్లర్ అవుతారని.. అలాగే హీరో కూడా విజయం సాధించాలని కోరుతూ ఆగస్టు 25న అందరూ తప్పకుండా థియేటర్లో ఏం చేస్తున్నావ్ చిత్రం చూడాలని టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

నటీనటులు: విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని, అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల, మధు తదితరులు

రచన దర్శకత్వం: భరత్ మిత్ర
నిర్మాత: నవీన్ కురువ, కిరణ్ కురువ
సహానిర్మాత: హేమంత్ రామ్ సిద్ధ
బ్యానర్:NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ అడవి
ఎడిటర్: హరీష్ శంకర్TN
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ సామల
ఆర్ట్ డైరెక్టర్: గణేష్
కో డైరెక్టర్: రామ్ GV
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: కొండ నాయుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ నాయుడు అల్లం
డిజిటల్ పీఆర్ఓ: మురళి కృష్ణ సురపనేని
పీఆర్ఓ: హరీష్, దినేష్

Related Posts

Latest News Updates