ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్‌లో మస్క్‌కు ఏకంగా 133 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ రికార్డుతో ఇప్పటి వరకు ట్విట్టర్‌లో అత్యధికమంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను మస్క్ అధిగమించారు. మస్క్ రికార్డుతో ఒబామా రెండో స్థానానికి పడిపోయారు. ఒబామాను ప్రస్తుతం 133 మిలియన్ల మంది ట్విట్టర్‌లో అనుసరిస్తున్నారు.
ట్విట్టర్ లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రికార్డు 2020 నుంచి ఒబామా పేరుపైనే ఉంది. ఇప్పుడా రికార్డు మస్క్ సొంతమైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం గతేడాది అక్టోబరు 27న మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆయన ఫాలోవర్ల సంఖ్య 110 మిలియన్లుగా ఉంది. అనంతరం ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 133 మిలియన్లకు చేరుకోవడం విశేషం. అంటే సగటున రోజుకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ ప్రొఫైల్స్ సూచించిన ఫాలోవర్స్ ప్రకారం ఒబామాకు 1,33,042,819 మంది ఫాలోవర్స్ ఉండగా, మస్క్ ఫాలోవర్స్ సంఖ్య 133,068,709 మందిగా ఉంది.