“ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి సల్లో హలితా కంటకా భూషణా
వరవమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్బయంకరీ.”
ఒకానొక సమయంలో దుర్గం అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విశ్వం పూర్తిగా విధ్వంసం సృష్టించేవాడు. దేవతలు అతడిని ఓడించలేకపోయేవారు. అతడి దారుణాలు భరించలేక కైలాసానికి శివుడి సహాయం కోసం వెళ్లారు. కానీ, దుర్గానికి మనుషుల చేతిలో మరణం లేని వరం పొందాడు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు తమ బలాలతో శక్తిని సృష్టిస్తారు. దీంతో ఆమె వెంటనే అవతరించి.. శాంతిని నెలకొల్పడానికి ఆమె ఆ రాక్షసుడిని సంహరించింది. అందుకే ఆమె దుర్గాగా అవతరించింది.
మహాష్టమి రోజు మహాస్నానం తర్వాత తొమ్మిది కుండలను ఏర్పాటు చేసి 9 శక్తులను ఆవాహన చేస్తారు. ఈ మహా అష్టమి పూజ సమయంలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.
నవరాత్రుల్లో దుర్గాష్టమి అష్టమి రోజు వస్తుంది. నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత శక్తిమంతమైనవి. ఇక దుర్గాష్టమి మహాస్నానంతో మొదలవుతుంది. ఎందుకంటే పవిత్రమైన వేడుకలకు ముందు శరీరాన్ని, అపవిత్రమైన ఆలోచనలను తొలగించడానికి ఇలా చేస్తారు. దుర్గాష్టమి మన దేశంలో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. అష్టమి అంటే ఎనిమిది. నవరాత్రుల్లో మహాగౌరీ అంకితమిచ్చిన రోజు. దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఈరోజు మహాశక్తి చాముండి అవతారాన్ని పూజిస్తారు. చాముండి ఈరోజు మహిషాసురుడి రాక్షస సహచరులైన చండా, ముండా, రక్తబీజాలను అంతం చేస్తుంది.
నవరాత్రి పూజలను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.
స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ దుర్గాదేవిని అర్చిస్తారు. దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. నవరాత్రులను పురస్కరించుకుని భక్తులు శక్తిపీఠాలను దర్శించుకుంటారు. దుర్గాష్టమి, విశేష పర్వదినాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటారు.!!
మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు