టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరో, హీరోయిన్లు, దర్శకుల చుట్టూ ఈ ఉచ్చు బిగిసుకుంది. అప్పట్లో టాలీవుడ్ లో కొంత మంది నటీ నటులు విదేశీయుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. తాజాగా… మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది.ఈ కేసులోనే ఈడీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న విచారణకు హాజరవ్వాలని సూచించింది. గతేడాది ఇదే కేసులో రకుల్ విచారణకు హాజరయ్యారు. అయితే… తనకు పని వుందని, ఈడీ విచారణ మధ్యలోనే వెళ్లిపోయింది.












